ఘనంగా మాన్యశ్రీ కాన్షీరామ్ జయంతి

– డీ.ఎస్.పీ.మండల అధ్యక్షులు ఎర్రోళ్ల  దీపక్ 
నవతెలంగాణ – మిరుదొడ్డి
భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను భూకంపాన్ని సృష్టించి సామాజిక రాజకీయ సాంస్కృతిక సమానత్వానికి పునాది వేసిన సామాజిక సమానత్వ సిద్ధాంతకర్త మాన్యశ్రీ కాన్షీరాం. అని డీ.ఎస్.పీ. మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల దీపక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హమారా రాజ్ తుమారా నహి చలేగా నహి చలేగా అంటూ అగ్రకుల రాజకీయ నాయకులని భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తి అన్నారు.. బాబా సాహెబ్ అంబేడ్కర్ అసంపూర్తిగా అగిపోయిన నీ మిషనరీ వర్క్ ని కాన్షీరాం పూర్తి చేస్తానని బహుజన సమాజంలో విప్లవాత్మక చైతన్యాన్ని రగిలించాడు అని అన్నారు. కులాన్ని నిర్మూలిద్దాం బహుజన సమాజాన్ని నిర్మిద్దాం, ఎవరి జనాభా ఎంతో వారి భాగస్వామ్యం  కూడా అంతే ఉండాలి అని కాన్సిరాం గారి స్ఫూర్తితో డాక్టర్ విశారదన్ మహరాజ్ గత 13 సంవత్సరాలుగా సాంస్కృతిక ఉద్యమం నిర్మాణం చేసి గత ఏడాది కాన్షీరాం  జయంతి రోజున ధర్మ సమాజ్ పార్టీ నీ స్థాపించడం జరిగిందని తెలిపారు.  ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 45 రోజుల పాటుగా మార్చ్ 15 వ తారీకు నుండి ఏప్రిల్ 30 వ తారీకు వరకు  “పీడిత ప్రజల విముక్తి ప్రదాతల జన్మదిన ఉత్సవాలు” రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ మండల నాయకులు  చందు, నవీన్, రవి, మనోజ్  తదితరులు పాల్గొన్నారు.