ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ పట్టణంలో సావిత్రిబాయి పూలే  వర్ధంతి వేడుకలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మన తొలి తరాలకు ఉపాధ్యాయురాలుగా నిలిచిన సావిత్రిబాయి పూలే జీవితాన్ని, ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్  పచ్చిమట్ల రవీందర్ గౌడ్,బి ఎస్పి  జిల్లా కార్యదర్శి ఎలగందుల శంకర్, బి ఎస్ పి  మండల అధ్యక్షులు వేల్పుల రాజు, శరత్ పాల్గొన్నారు.