ఘనంగా సీతక్క పుట్టినరోజు వేడుకలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దనసరి సీతక్క 52వ పుట్టినరోజు వేడుకలను మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ నేతృత్వంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.  మండల కేంద్రంలోనీ బస్టాండ్ ఆవరణ వద్ద గల ఇందిరా గాంధీ విగ్రహం ప్రాంతంలో పసర చలువాయి గ్రామాలలో 163వ జాతీయ రహదారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సీతక్క అభిమానులు విస్తృతంగా బర్త్డే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో సుమారు 30 అడుగుల పైబడి కటౌట్ ను జాతీయ రహదారి వెంట రాఘవపట్నం పెట్రోల్ బంక్ క్రాస్ లో నిర్మించారు.
పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మహిళ మణులు పంచుకున్నారు.ఈ సందర్భముగా వెంకటకృష్ణ  మాట్లాడుతూ ముందుగా మన ప్రియతమ నాయకురాలు, మనందరి ఆడబిడ్డ, అడవమ్మ ఒడిలో పెరిగిన అడివి బిడ్డ సీతక్క గారికి మరొక సారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సీతక్క  నిఖార్సైన, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకురాలు అని, ఒక రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా, మానవతా వాదిగా, ప్రశ్నించే గొంతుకగా మారి ప్రజల ఇబ్బందులను తొలగించడంలో తనకి సాటి ఎవరు లేరని అన్నారు. నిర్మలమైన, నిష్కల్మషమైన మనసుతో ప్రజలందరి హృదయాలను చూరగొన్న నిరాడంబరి సీతక్క అని, సీతక్క  ములుగు గడ్డ మీద ఉండడం నిజంగా మన అదృష్టం అని, సీతక్క  2018 ఎన్నికల్లో గెలవగానే మనకు ములుగు జిల్లా వచ్చిందని, సీతక్క  పోరాట పటిమ వల్లనే మల్లంపల్లి మండలం అయింది అని, సీతక్క గారు నేడు చొరవ తీసుకుని మరీ ములుగు గ్రామాన్ని మున్సిపల్ చేసిందని, సీతక్క  ములుగు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అని అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెలలోపే ములుగు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 3 కోట్ల చొప్పున 30 కోట్లతో అంతర్గత రోడ్లు వేయించిందని, అత్యంత ప్రతిష్టాత్మక మేడారం జాతరను ఒంటిచేత్తో సమర్థవంతంగా నడిపించిందని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో తన కీర్తి, ప్రతిష్టలు ఖండాంతరాలు దాటించి, ములుగు నియోజకవర్గాన్ని ప్రపంచం నలుమూలల తెలిపిన ఐరన్ లేడీ సీతక్క ని అన్నారు. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజా క్షేత్రంలో, ప్రజా నాయకురాలిగా, ప్రజా సమస్యలు తొలగిస్తూ, నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.