సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలను సోమవారం ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ తెలంగాణ రాష్ర్ట ఆధ్యక్షులు మేకల బాలు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 3వ అతిపెద్ద జాతీయ సామజ్వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పార్టీ అధ్యక్షులు సింహాద్రి, వెంకట రాజయ్య , బోనాల విజయ్ , మేకల క్రిష్ణ , శ్రీహరి ముదిరాజ్ , రాములు పాల్గొన్నారు.