నవతెలంగాణ-కెరమెరి
మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రాం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పొర్ల వెంకటేష్ మాట్లాడారు. జగ్జీవన్ రాం అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత మహనీయుడని పేర్కొన్నారు. దళిత సమాజమం ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సేవలాల్ సేన జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రూప్ లాల్ నాయక్, ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి వినేష్ మాదిగ, మాజీ ఎంపీటీసీ గోగర్ల రాజయ్య మాదిగ, కూటికల ఆనంద్ మాదిగ, పెంటపర్తి మహేష్ మాదిగ, అశోక్ మాదిగ, రాజేందర్ పాల్గొన్నారు
కాగజ్‌నగర్ రూరల్ : భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ మాట్లాడుతూ భారత స్వతంత్ర సమరయోధులు, భారత దేశ ఉప ప్రధాని, దళిత ఆశాకిరణం, సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్తని కొనియాడారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కలికోట రమణయ్య, మార్త ఉపేందర్, ఎలాగౌడ్, పురుషోత్తం, సీతారాం, కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.