నవతెలంగాణ-జన్నారం
దళిత సంఘాల నాయకులు మామిడిపల్లి ఇంద్రయ్య బోర్లకుంట ప్రభుదాస్ తాళ్లపల్లి రాజేశ్వర్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అతను దళిత జాతికి పేద ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఆ మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో దళిత సంఘాల జిల్లా నాయకులు దుమల రమేష్, కోల పద్మారావు ప్రవీణ్, ప్రశాంత్, కొండుకూరి రాజు, ప్రశాంత్, మండల నాయకులు మల్కల్ల రమేష్, వేల్పుల రాజేష్, వెంకటేష్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొండుకూరి ప్రభుదాస్ పాల్గొన్నారు.