నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
కల్లుగీత కార్మికుల ఉపాధి మెరుగు పడటానికి తాటి ఈత వనాలనుపెంచడానికి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని గ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించి అమరులైన అమరుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు దబ్బటి చిత్తారి గౌడ్ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున విప్లవ జేజేలు పలుకుతున్నామని క్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య తెలిపారు.కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారిని స్మరిస్తూ జరుగుతున్న అమరుల యాది లో సభ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో సంఘం అధ్యక్షులు పబ్బతి వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశంలో పాల్గొన్న రాగిరి కృష్ణయ్య మాట్లాడుతూ అమరులు చూపిన మార్గంలో పనిచేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతంలో గీత కార్మిక ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన సూదగాని ఎట్టయ్య, మోరిగాడి యాదగిరి బాటలో పనిచేసి అమరుడైన కల్లుగీత కార్మికుల ఉపాధి అవకాశాల కోసం ఐదు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని గ్రామానికి తిరిగి వస్తున్న సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నేలపట్ల గ్రామానికి చెందిన అమరుడైన గీత కార్మికుడు దబ్బటి చిత్తారి గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతా కార్మికులు తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వాలపై ఉద్యమించాలని అన్నారు. ప్రతి గీత కార్మికుడికి ఉచితంగా సేఫ్టీ మోకు ఇవ్వాలని,ప్రతి గీత కార్మికునికి ఉచితంగా బైకులు ఇవ్వాలని, గీత కార్మికుల సంక్షేమానికి, గీత కార్పొరేషన్ కి 5000 కోట్లు కేటాయించాలని, ప్రతి గీత కార్మికులకు పెన్షన్ ₹5000 రూపాయలు ఇవ్వాలని, నందనం వద్ద ఉన్న నీరా కేంద్రానికి నిధులు కేటాయించి, ప్రారంభించాలని డిమాండ్ చేశారు, తాటి ఉప ఉత్పత్తులు, అల్లికలు బుట్టలు పై,తాటి బెల్లం ద్వారా చాక్లెట్లు తయారీ పై గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి తాటి ఉప ఉత్పత్తులు అయ్యేటట్లు చూడాలని కోరారు,. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల లక్ష్మయ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి అంతటి అశోక్ సంఘం అధ్యక్షులు పబ్బతి వెంకటయ్య మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య గౌడ్. సంఘం ఉపాధ్యక్షులు పబ్బు నరసింహ సంఘం నాయకులు చౌట వేణుగోపాల్ దబ్బటి కిష్టయ్య. గంగాపురం నగేష్,దబ్బటి బక్కయ్య,దబ్బటి భూషణ్,చౌట శివకుమార్, గుండు రాజు,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.