మాజీ విప్ గంపకు జన్మదిన శుభాకాంక్షలు

నవతెలంగాణ – రామారెడ్డి 
మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జన్మదినo సందర్భంగా బుధవారం మండల బి.ఆర్.ఎస్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు రాథోడ్ సేవ్య నాయక్ హైదరాబాదులోని తన నివాసంలో గంపకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన జనహృదయనేత మాజీ ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ అని కొనియాడారు.