
దివంగత నేత, మాజీ మంత్రివర్యులు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా చండూరు మున్సిపల్ కేంద్రంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గోవర్ధన్ రెడ్డి కుమార్తె బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మారుమూల గ్రామంలో జన్మించి మునుగోడు శాసనసభ్యులుగా, మంత్రి గా, రాజ్యసభ సభ్యులుగా రాష్టానికి, నియోజకవర్గానికి చేసిన సేవలను కొనియాడారు. పార్టీలకు అతీతంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయసాధన కోసం పనిచేయాలని కోరారు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో జీవితమంతా ప్రజాసేవకు అంకితం చేస్తానని ఆమె అన్నారు. మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, కౌన్సిలర్లు పలువురు బి ఆర్ యస్ నాయకులు మాట్లాడారు. బి ఆర్ యస్ మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తోకల వెంకన్న, అన్నెపర్తి శేఖర్, కోడి వెంకన్న, కో ఆప్షన్ సభ్యులు రావిరాల నగేష్, బి ఆర్ యస్ రాష్ట్ర నాయకులు శిరంశెట్టి శ్రీధర్ బాబు, తేలుకుంట్ల జానయ్య, కట్ట అంజయ్య, తేలుకుంట్ల చంద్రశేఖర్, పున్న సైదులు, ఇరిగి రామన్న, గండూరి నగేష్, ఇరిగి రామకృష్ణ, రావిరాల నగేష్, కొలుగూరి రాంగోపాల్, రాపోలు జగదీష్, స్వామిగౌడ్, భూతరాజు యాదగిరి, కొత్త అంజిబాబు, అన్నెపర్తి యాదగిరి, సురేష్, శ్రవణ్, అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.