ఘనంగా హనుమాన్ జన్మదినం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని వివిధ గ్రామాల్లో హనుమాన్ జన్మ దినం గ్రామ కమిటీల ఆధ్యర్యంలో ఘనంగా మంగళవారం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామాల్లో శోభాయాత్రను చేపట్టారు. అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంల్లో గ్రామ కమిటీ సభ్యులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.