ఘనంగా హరీష్‌రావు జన్మదినం

నవ తెలంగాణ -నర్వ
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖలమాత్యులు తన్నీరు హరీష్‌రావు 51వ జన్మదిన వేడుకలను శనివారం మండల కేంద్రంలో యువనాయకులు జనార్దన్‌, రామన్‌గౌడ్‌, విజరు, పాండు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులతో ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రో గులకు, పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జనార్దన్‌ మాట్లాడు తూ.. పదువులకే వన్నె తెచ్చేలా పని చేసే నాయకులు, ఆపద అని తలపు తట్ట గానే అండగా నిలబడే పెద్దమనుసు కలిగిన ప్రజానాయకుడు హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నాగిరెడ్డి, అరవింద్‌రెడ్డి, శేఖర్‌ యాదవ్‌, అజిత్‌ సింహరెడ్డి, సత్యన్న, శేఖర్‌గౌడ్‌, గోపాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, అనిల్‌, నరసింహా తదితరులు పాల్గొన్నారు.