
మండల కేంద్రంలోని జాతీయ నాయకుల విగ్రహాల కూడలిలో ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే 135 వ వర్ధంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వెలివాడల్లో తొలిపోద్దు అయి ఉదయించిన క్రాంతి రేఖాగా, మానవాళి చేత మహాత్మా అని పిలిపించుకున్న మహనీయుడుని కొనియాడారు. మహత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఘన నివాళులుఅర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహాల నిర్మాణ వ్యవస్థాపక కమిటి అధ్యక్షులు ఎ పులిమాల కృష్ణారావ్ మాదిగ,ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జి ఆడెపు నాగార్జున మాదిగ,సామాజిక ఉద్యమకారులు కుక్కమూడి ముత్యాలు, టిఆర్ఎస్ పెద్దవూర మండల పార్టీ అధ్యక్షులు జటావత్ రవి నాయక్, ముదిరాజుల సంఘం నాయకులు ఈదవెంకన్న, రమావత్ రవి వ ఊరమధు, బొనిగా మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.