ఘనగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో సోమవారం నాడు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే పుట్టిన రోజు వేడుకలను మండల కార్యకర్తలతో కలసి జరుపుకున్నారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడ్తు ఎమ్మెల్యే మండల పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.మా మండల ప్రజల తరపు నుండి  జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతు ఈ లాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ హన్మంత్ రెడ్డి,సర్పంచ్ ఫోరం  అధ్యక్షులు తిర్మల్ రెడ్డి, సర్పంచ్లు,ఎంపిటిసిలు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.