ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి..

Happy birth anniversary of Professor Jayashankar Sir..నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలములో ఘనంగా నిర్వహించడం జరిగింది అని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ బిఎస్ లతా అన్నారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి,శ్రద్దాంజలి గటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారని, ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయవిశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొంది, 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారని. తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నదని, జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణ  నినాదాన్ని వినింపించిన పోరాట శీలి అని ఆయనను యువత మరియు ఉద్యోగులంతా స్ఫూర్తిగా తీసుకొని, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్దికి పాటుపడాలని తెలంగాణ ఆశయాలను ముందుకు తీసుకోని పోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ సూపరిటెండెంట్స్ హేమమాలిని, శ్రీలత, పద్మారావు జిల్లా అధికారులు డి టి డి ఓ శంకర్, సిపిఓ ఎల్. కిషన్, డి సి డి ఓ లత, ఐసిడిఎస్ పిడి నరసింహారావు, శ్రీనివాస రావు,  టి.ఎన్.జి.వో. జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, నరహరి,సిబ్బంది, ఉద్యోగులు తదితరులు  పాల్గొన్నారు.