ఘనంగా సద్గురు సంతు రవిదాస్ మహారాజ్ జయంతి వేడుకలు 

నవతెలంగాణ – రామగిరి 
సద్గురు సంతు రవిదాస్ మహారాజ్ జయంతి ఉత్సవాలు మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో (బుధవారంపేట) లో సంతు రవిదాస్ మహారాజ్ జయంతి ఉత్సవాలను సంతు రవిదాస్ భక్తి మార్గ సౌత్ ఇండియా కమిటీ సభ్యులు కన్నూరి శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగిరి మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమరయ్య గౌడ్ హాజరై మాట్లాడార. 600 సంవత్సరాల క్రితమే అందరూ భగవంతుని చేరుకోవచ్చు అనే సందేశాన్ని ఇచ్చి విశ్వ గురువుగా మారిన సంతు రవిదాస్ మహారాజును ఈ సమాజం ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అన్నారు. అదేవిధంగా వందల సంవత్సరాల క్రితమే మీరాబాయి, లాంటి జ్ఞానవంతురాలు అయిన మహిళలు కూడా సొంత రవిదాస్ భక్తురాలుగా శిష్యురాలుగా మారిపోవడం అంటే ఆయన ఎంత గొప్పవారో అర్థమవుతుందని, అలాంటి మహనీయుని ఆశయాలను మనం నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్  అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవనూరి శ్రీనివాస్ రజిత, ఉప్పరి సంఘం నాయకులు కాటుపల్లి శంకర్,  రేషన్ డీలర్ల సంఘ సభ్యులు కన్నూరి మల్లేష్, గాండ్ల అనిల్, రాజు, సమ్మయ్య, రాహుల్, అడ్డూరి మల్లయ్య,  కన్నూరి రాకేష్,  అభిలాష్, తదితరులు పాల్గొన్నారు.