
మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, జిల్లా ఎన్నారై సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా ప్రణాళిక కమిటీ అధ్యక్షులు దశరథం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.