ఘనంగా వైయస్సార్   జన్మదిన వేడుకలు

నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి  దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి  75 వ జయంతి ని నల్లగొండ జిల్లా కేంద్రంలో  మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడిన మహానేత వైయస్ఆర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో  వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి,  కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్,  డీసీబీసీ డైరెక్టర్ సంపత్ రెడ్డి,  మాజి జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య,  పలు వార్డుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,  పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.