ఘనంగా ఇంజనీర్ల దినోత్సవం

నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పానగల్ చౌరస్తాలో ఉన్న భగీరథ సర్కిల్లో తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవాని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ డి. వెంకటేశ్వర్లు, టిజిఓ  జిల్లా అధ్యక్షులు ఎండి. ముజీబుద్దిన్, టిఆర్డబ్ల్యు ఎస్ఈఏ అధ్యక్షులు మధు, నరసింహ, సంపత్, రామకృష్ణ, ఏ. రవి, సంతోష్ రెడ్డి, రమేష్, గోకుల్ సాయి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వన మహోత్సవం కింద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద మొక్కలు నాటారు.