ఘనంగా రైతు దినోత్సవం

– పథకాలపై రైతులకు అవగాహన
– సాధించిన విజయాలపై చర్చ
నవ తెలంగాణ -నర్వ
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండల వ్యాప్తంగా వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధికా రులు, ప్రజా ప్రతినిధులు రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు 2016 నుంచి 2023 వ రకు జిల్లాలో వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధి, రైతులకు ప్రభుత్వం పథకాలు, సాగు, రుణమాఫీ, 24గంటల ఉచితవిద్యుత్‌, రైతుబంధు, బీమా పథకాల ద్వారా ఆర్థికంగా సా ధించిన విజయాలపై రైతులకు వివరించారు. ముందుగా రైతు వేదిక నుంచి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వ లన,జాతీయ గీతాలపన తర్వాత పలువురు మాట్లాడు తూ.. వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి సందేశాన్ని రైతులకు వివరించా రు. రైతులతో ముచ్చటించి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్ర మంలో మండల, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతుబంధు అధ్యక్షులు, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
ఉండవల్లి: మండలంలోని కొరిపాడులో రైతు వేదికల్లో శనివారం తెలంగాణ రాష్ట్ర అవత రణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవంలో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, స్పెషల్‌ అధికారి ప్రశాంతి, ఎమ్మెల్యే అబ్రహం హాజరైయ్యారు. అనంతరం గ్రామస్తులు ఉన్నతాధికారులను పూలమాల శాలువాతో సత్కరించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. రైతుసంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతుబీమా దేశానికే ఆదర్శంగా నిలిచా యన్నారు. అనంతరం కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. రైతుబంధు రైతు బీమా తీసుకున్న కుటుంబాలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పెషల్‌ అధికారి ప్రశాంతి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. పంట పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సాగునీటి వసతులు ఉచిత కరెంటు తదితర సంక్షేమ పథకాలు ప్రభు త్వం ఉచితంగా అందిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీని వాసులు, ఎంపీ టీసీ మమత రఘురెడ్డి, ఎంపీపీ అశోక్‌రెడ్డి, ఆయా మండల శాఖ అధికారులు, రైతు సం ఘం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కృష్ణ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం మండ లంలోని రైతువేదికలల్లో ఘనంగా రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. ముడుమల్‌, గుడె బాల్లుర్‌, హిందూపూర్‌, కున్సి, మరియు చేగుంట రైతు వేదికలో సంబంధిత జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కో-ఆర్డినేటర్లు, రైతుబంధు కో-ఆర్డినేటర్లు మరియు సభ్యులు, ప్రోగ్రెసివ్‌ ఫార్మర్స్‌, పబ్లిక్‌ లీడర్లు, గ్రామ రైతు లు పాల్గొన్నారు. ఉత్సవాలు ఉదయం ర్యాలీల రూపంలో రైతు వేదికకు రైతు లు చేరుకున్నారు. తదనంతరం జాతీయ గీతాలాపన వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన సందేశాన్ని మండల వ్యవసాయ అధికారి సుదర్శన్‌ గౌడ్‌ కృష్ణ రైతు వేదికలోచదివి రైతులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, ఏఈఓ లు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకా లైన రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, పంట రుణమాఫీ అంశాల గురించి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
ధరూర్‌ : మండలంలోని చేనుగోనిపల్లెలో రైతువేదికల్లో శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవ సంబరాల్లో ము న్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వైస్‌ చైర్మన్‌ బాబర్‌, గ్రామ సర్పంచ్‌ గురం అనంతమ్మ, ఎంపీటీసీ సరోజమ్మ, ఉప సర్పంచ్‌ కురుమన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్‌ కేశవ్‌ మాట్లాడుతూ.. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో సాధించిన సంక్షేమ పథకాల గురించి రైతులకు వివరించారు. రైతులకు మున్సిపల్‌ చైర్మన్‌, గ్రామ సర్పంచ్‌ పూలమాల శాలువాతో సన్మానించారు. అదేవిధంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండోరోజూ రైతుసంబరాలు మండల పరిధిలోని మార్లబీడు, ర్యాలంపాడు, ఓబులోనిపల్లి, గ్రామాల క్లస్టర్‌కు సంబంధిం చిన మా ర్లబీడులో వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్‌లతో ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తుం దన్నారు. అదేవిధంగా కేటీదొడ్డి మండలంలోని చింతలకుంటలో రైతు వేదికల్లో శనివారం తెలంగాణ రాష్ట్ర అవతర ణ దశాబ్ది ఉత్సవాలలో జెడ్పీటీసీ రాజశేఖర్‌, గ్రామ సర్పంచ్‌ సువర్ణమ్మా, ఎంపీటీసీ గోవింద్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ లక్ష్మమ్మ గారు, డైరెక్టర్‌ సింగిల్విన్‌ డైరెక్టర్‌ రఘుకుమార్‌ శెట్టి హాజరైయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కే.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో సాధిం చిన పథకాలు గురించి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ శ్రీను, వార్డ్‌మెంబెర్‌ సవరన్నా, రవి, అగ్రికల్చర్‌ మేడం ఉషారాణి, పంచాయతీ సెక్రటరీ రియాజ్‌, నాయకులు సూరి, తాసిల్దార్‌ రమేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు సల్వా రెడ్డి, మండల యూత్‌ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మర్లబీడు, ర్యాలంపాడు, ఒబులోని పల్లి గ్రామాల సర్పంచ్లు శ్రీరాములు, గ్రామపంచాయతీ సెక్రటరీ భా స్కర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి మహాలక్ష్మి, వార్డ్‌ మెంబర్లు పాల్గొన్నారు.
గట్టు: మండలం చాగదోన, మాచర్ల, బలిగేరా, గట్టు తదితర గ్రామాల్లోని శని వారం ఏర్పాటుచేసిన రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ సందర్భంగా రైతుదినోత్సవ వేడు కల్లో భా గంగా ఎద్దుల బండ్ల ర్యాలీని ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రారంభించారు. గ్రామ ఉత్తమ రైతులకు ఎంపీపీ గ్రామ సర్పంచ్‌లకు పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం రైతులతో కలిసి విందుభోజనం చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో సాధించిన విజ యమన్నారు. రైతుబంధు రైతుల పెట్టుబడి బాధలు తీర్చిందన్నారు. 24 గంటల ఉచిత కరంటు రైతులకు భరోసానిచ్చిందన్నారు. ఉచిత కరంట్‌ విజయవంతంగా అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. రూ.65 వేల కోట్లు రైతు బంధు కింద జమ చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వం రైతుభీమా కింద లక్షమంది రైతుకుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం కేసీఆర్‌ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ఇంజమ్మ, ఎంపీటీసీ ఎస్‌ మౌనిక, అంతంపల్లి సర్పంచ్‌ ఆంజనేయులుగౌడ్‌, రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు వేమారెడ్డి, మాజీ ఎంపీటీసీ బుడ్డప్ప, మాజీ సర్పంచ్‌ శంకరన్న, బీఆర్‌ఎస్‌ నాయకులు శివప్ప, సునందు, పర మేష్‌, బాబు, జయరాం గౌడ్‌, కురువ నరసింహులు, రాంరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, భాస్కర్‌, సుదర్శన్‌, ప్రవీణ్‌, పంచాయతీ కార్యదర్శలు కృష్ణగౌడ్‌, రవీందర్‌గౌడ్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, వెటర్నరీ డాక్టర్స్‌ కనకరాజు, పృథ్విరాజు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కోస్గి
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయడంతో పాటు, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు దినోత్సవ సందర్భంగా మం డలం లోని హాన్మన్‌పల్లిలో శనివారం రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరికీ తెలం గాణ రాష్ట్ర రైతు దినోత్సవ శుభా కాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం సాధిం చుకున్న తర్వాత ప్రజలందరికీ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాయని అన్నా రు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాష్‌ రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, వైస్‌ ఎంపీపీ సాయిలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ భీమిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీరారెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.