నవతెలంగాణ-గండిపేట్
నార్సింగ్ మున్సిపాలిటీలో హనుమాన్ జయంతి వే డుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం నా ర్సింగ్ మున్సిపాలిటీలని 17వ వార్డులో శ్రీ బాలాంజ నేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వ హించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. నార్సింగ్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉషారాణి, సభ్యులు సాయి, తదితరులు పాల్గొన్నారు.