నవతెలంగాణ-పెద్దవంగర: హోలీ సంబరాలు సోమవారం మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే యువతీయువకులు, విద్యార్థులు రంగులతో వీధుల్లో సంచరిస్తూ, ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ, రంగు నీళ్లు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ.. ఆనందంగా గంతులు వేశారు. హోళీ.. హోళీ రంగోళీ.. అంటూ చిందులు కూడా వేశారు. గ్రామాల్లోని వీధులు రంగులమయం అయ్యాయి. నాయకులు, పోలీసులు, జర్నలిస్టులు ఒకరికొకరు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.