78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలో స్వగృహంలో మరియు ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు, అభిమానులకు, అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, సీనియర్ నాయకులు అంజిరెడ్డి, క్రిష్ణ రెడ్డి, వాహబ్, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.