ఘనంగా గణితశాస్త్ర దినోత్సవం..

నవతెలంగాణ-బెజ్జంకి 

మండలంలోని అయా గ్రామాల్లోని పాఠశాలల్లో గణితశాస్త్ర దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయం,గీత ఉన్నత పాఠశాలలో విద్యార్థులు గణితశాస్త్ర సిద్ధాంతాలపై ప్రయోగ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అయన చిత్రపటానికి భోదన సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణితశాస్త్ర పితమహుడిగా పేరు ప్రఖ్యాతిగాంచిన శ్రీనివాస రామానుజం జన్మదినాన్ని గణితశాస్త్ర దినోత్సవంగా జరుపుకోవడం చాల సంతోషకరమని ఆదర్శ విద్యాలయ ప్రధానాచార్యులు హర్జీత్ కౌర్ అన్నారు.అయా పాఠశాలల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.