ముస్లింలకు మొహరం శుభాకాంక్షలు: కలెక్టర్

Moharram greetings to Muslims: Collectorనవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ముస్లింలకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మోహరం పండుగ శుభాకాంక్షలు మంగళవారం ఒక ప్రకటనలో  తెలిపారు. మొహర్రం పండుగ త్యాగానికి, స్ఫూర్తికి ప్రతీక అని, విశ్వాసం, నమ్మకం కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవటమే మొహరం పండుగ ప్రత్యేకత అని అన్నారు. మానవజాతి త్యాగం ఎంతో గొప్పదని మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవటమే ఈ పండుగ యొక్క ప్రత్యేకతని కలెక్టర్ పేర్కొన్నారు.