నవతెలంగాణ – శంకరపట్నం
జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకుని గురువారం శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కేశవపట్నం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూల్లో చదువుతున్న పిల్లలకు నులిపురుగుల గురించి డాక్టర్ శ్యాంప్రసాద్ అవగాహన కల్పించారు. అనంతరం స్కూల్ పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ శ్రీమతి శ్రీ బొజ్జ కవిత,ప్రిన్సిపాల్ మాధవి, సి హెచ్ ఓ భాస్కర్ సార్, హెల్త్ సూపర్వైజర్ అనిల్, మరియు వైద్య సిబ్బంది, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.