ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం

నవతెలంగాణ –  అచ్చంపేట 

ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అచ్చంపేట వారి ఆధ్వర్యంలో బుధవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలలో అంగన్వాడి సెంటర్లలో బాలికలకు అవగాహన కల్పించారు. సూపర్వైజర్ విజయ మణెమ్మ మాట్లాడుతూ..మహిళలు నేడు చాలా రంగాల్లో రాణిస్తున్నారని, గొప్ప స్థాయికి చెరుకున్న మహిళల గురించి వివరించారు. పూర్వం నుంచి ఇప్పటివరకు బాలికల పట్ల, మహిళల పట్ల లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆధునిక కాలంలో మహిళలు చాలా రంగాల్లో గొప్ప స్థాయికి చేరుకున్నప్పటికీ, శాస్త్రసాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇంకా బాలికల పట్ల వివక్షత తో భృణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. బాలికలకు చిన్నప్పటి నుంచే బాలుర తో సమానంగా చదివించి సమాన అవకాశాలు కల్పిస్తే వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. కాబట్టి బాలికలు బాగా చదువుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలని సూచించారు.