
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లోనూ ముందువరుసలో ఉండాలని,లింగ అసమానత, పాఠశాల డ్రాపౌట్లు,ఆరోగ్య సంరక్షణ,బాల్యవివాహాలు వంటి సమస్యలతో పోరాడుతున్న సమాజంలో అన్ని సవాళ్లను ఎదుర్కోవాలని, విద్య ద్వారానే ఈ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని కష్టపడి చదువుకుంటే ముందు జీవితమంతా సుఖంగా గడప వచ్చునని,జ్ఞాన సాధనాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవాలంటే పౌష్టిక హారాన్ని భుజించాలని అందుకేప్రభుత్వం పౌష్టకాహారంతో కూడిన మధ్యాహ్నభోజనం, రాగిజావలను అందిస్తుందని వీటిని వినియోగించుకొని ఆరోగ్యకరంగా తయారవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.