ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలోని శ్రీ చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, ప్రిన్సిపాల్ అశోక్ యాదవ్ మాట్లాడుతూ గణిత శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్ గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, భవాని, భాగ్యలక్ష్మి, పిఈటి శ్రీనివాస్, నవీన్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.