ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవము

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో శ్రీనివాస రామానుజన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంలో విద్యార్థులు సైన్స్  కి సంబంధించిన వివిధ ప్రదర్శనలు చేశారు. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల కరస్పాండెంట్ శ్రీరాములు,  డైరెక్టర్ లు శ్రీశైలం, రాజకుమారులు మాట్లాడుతూ ప్రస్తుత రోజులలో సైన్స్ లేనిది జీవనం కూడా లేదని భారత దేశంలో జరుపుకునే అన్ని పండుగలకు సైన్స్ ముడిపడి ఉందని, మన సంప్రదాయంలో కూడా సైన్స్ ఇమిడి ఉందని, ప్రతి విద్యార్థి సర్ సివి రామన్ ను ఆదర్శంగా తీసుకొని మంచి సైంటిస్టులుగా కావాలని అదేవిధంగా అబ్దుల్ కలాం, జేసి బోస్ లాంటి గొప్ప సైంటిస్టులను ఆదర్శంగా తీసుకొని, మంచి ఆదర్శవంతమైన ప్రతిభావంతమైన విద్యార్థులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు. ఈ  కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్, రజనీకాంత్,  ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.