ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

నవతెలంగాణ – అశ్వారావుపేట
సర్ సి.వి.రామన్ జయంతి సందర్భంగా బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత (బాలురు) పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శనను ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో విజ్ఞానశాస్త్రం కీల పాత్ర వహిస్తుందని ప్రతి విద్యార్ధి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.స్థానిక సూర్య, మైనార్టీ గురుకులం,గౌతమి స్కూల్,జవహర్ విద్యాలయం , పాఠశాలల్లో విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు.రామన్ ఎఫెక్టు, ఫోటో సింథసిస్,వివిధ రకాల కాలుష్యాలు,హైడ్రో ఎలక్ట్రికల్ డామ్,సౌర కుటుంబం,పగలు రాత్రి ఏర్పడే విధానం, అగ్నిపర్వతాలు,ఇస్రో, పంటల పరిరక్షణ,ఎలక్ట్రిక్ సర్క్యూట్ వంటి ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు లక్ష్మయ్య, చలపతిరావు,మధుసూధనరావు,జి.వి.ఆర్.ప్రసాద్, విష్ణుప్రియ,నాగరాజు , రజిత, రామకృష్ణ,అంజలి తదితరులు విద్యార్ధులు చే విజ్ఞాన ప్రదర్శనలు చేయుటలో కృషి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు నరసింహారావు,వి.కిషోర్ బాబు,సలీం,విద్యార్ధులు పాల్గొన్నారు.