జాతీయ యువజన దినోత్స‌వ శుభాకాంక్షలు

నవతెలంగాణ -పెద్దవూర : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పేదల ఆశాజ్యోతి బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి ఆ మహనీయున్ని స్మరించుకుని నివాళులు అర్పించారు.శుక్రవారం వివేకానందుని చిత్రపటానికి పుష్ఫాంజలి ఘటించి ఘననివాళి అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ
యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు’ అన్న స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాని,ప్రతి సంవత్సరం వివేకానందుని జన్మంచిన జనవరి 12 న భారతీయులు ప్రతి ఏడాది జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.జాతీయ యువజనోత్సవ సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.