
నవతెలంగాణ – పెద్దవంగర
మండల వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వీరగంటి మహేందర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వేణుమాధవ్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై క్రాంతి కిరణ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. రాచరిక వ్యవస్థకు స్వస్తి పలికిన రోజు సెప్టెంబర్ 17 అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రంగు మురళి, పూర్ణచందర్, సైదులు, శ్రీనివాస్, సుధాకర్, గోపాల్, మహేష్, జానీ తదితరులు పాల్గొన్నారు.