
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట మంగళవారం, ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఏలేందర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కళ్లెం విజయ జాంగిర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రకాష్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి యాకూబ్, ప్రజలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.