ఘనంగా ప్రజా పాలన దినోత్సవాలు.. 

Public Governance Daysనవతెలంగాణ – తాడ్వాయి 
నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం మండలంలోని బీరెల్లి గ్రామపంచాయతీలో తాజా మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవాలు, 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వరి ధాన్యం కొనుగోలు, డ్వాక్రా, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వంగరి అనసూర్య సదానందం, కాళేశ్వం వీరాచారి, కారోబార్ వంగరి పుల్లయ్య, కాయితి లింగాచారి, బాసాని రామక్రిష్ణ, మొక్కటి కోటి, తదితర నాయకులు పాల్గొన్నారు.