ఘనంగా గణతంత్ర దినోత్సవం..

నవతెలంగాణ  – డిచ్ పల్లి 
తెలంగాణ యూనివర్సిటీ లో75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంచార్జీ వైస్ ఛాన్సలర్  బూర వెంకటేశం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్.ఎం. యాదగిరి  ద్వారా యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది తో పాటుగా విద్యార్థులకు పరిశోధకులకు శుభాకాంక్షలు తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్.యం. యాదగిరి పరిపాలనా భవనం ముందు  జెండా ఆవిష్కరించారు.అనంతరం  కార్యక్రమానికి హాజరైన అధ్యాపక, అధ్యాపకేతరసిబ్బంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం అనేక విశిష్ట లక్షణాలను కలిగి ఉన్నదని తెలిపారు.రాజ్యాంగమే సమ సమాజానికి దిక్సూచిగా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని పేర్కొన్నారు.1991 నుండి సరళీకుత ఆర్థిక విధానాలతో  భారతదేశం ఆర్థికవృద్ధిరేటును పెంచుకుంటూ ఇటీవల సంపన్న దేశాల కూటమి జీ -20 సదస్సుకు  సారథ్యం వహించేలా  ప్రతిష్ఠ పెంచుకుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2047నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్లకు పెంచే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనే విజన్ తో  పని చేస్తుందని పేర్కొన్నారు.భారతదేశ అభివృద్ధి అనేది విద్యా రంగ అభివృద్ధి మీదనే ఆధారపడుతుందని  విద్యారంగం ద్వారా  సత్ప్రవర్తన కారుణ్య భావన  పౌరుల్లో స్థిరపడుతుందని తెలిపారు. బావిభారత పౌరులైన విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు వెళుతూ మానవాభివృద్ధి సూచిక లో ముందుండేందుకు ప్రయత్నించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, అకడిమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్, ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్, ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ వంగరి త్రివేణి, కామర్స్ డీన్ ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి,  ఎగ్జికుటివ్ కౌన్సిల్ మెంబర్స్ ప్రొఫెసర్ నసీం, ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, ఆచార్య సంపత్ రెడ్డి, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ మూసా కురేషి, డా. బాలకిషన్ డా.జమీల్, డాక్టర్ శిరీష డాక్టర్ సత్యనారాయణ, సాయి గౌడ్, భాస్కర్, వినోద్, విజయలక్ష్మి, విద్యార్థులు పరిశోధకులు  పాల్గొన్నారు.