జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

– జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కంటేశ్వర్
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ భవన్ వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ రైల్వే స్టేషన్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిల్ అహ్మదాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దేశాన్ని రాజరిక పాలనలో కాకుండా ప్రజలందరికి స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వపు హక్కులు కల్పిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో కానీ గతంలో రాష్ట్రంలో పరిపాలించిన పాలకులు ఏ స్వాతంత్రం కొరకు స్వేచ్ఛ కొరకు అయితే రాజ్యాంగాన్ని అమలు చేశాము. వాటన్నింటినీ కాలరాస్తూ వ్యవస్థలన్నింటినీ తుంగలో తొక్కుతూ ప్రజల యొక్క స్వాతంత్రాన్ని ప్రశ్నించే గొంతు నువ్వు నొక్కారని ఆయన అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు తమ స్వాతంత్య్రాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా, ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ,  మరొక్క సారి జిల్లా ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు మానాల మోహన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, భక్తవస్థలం, జిల్లా కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, మీసాల సుధాకర్ రావు, జిల్లా సేవదల్ అధ్యక్షులు సంతోష్ ,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి , రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్,  పీసీసీ మాజీ కార్యదర్శి రాంభూపాల్, పీసీసీ డెలికేట్ ఈసా,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కేశ మహేష్,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ,నగర ఎస్సీ అధ్యక్షులు వినయ్, నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్ జ, పంచ రెడ్డి చరణ్ ,మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ, పోల ఉష, రేవతి, సుజాత, మలైకా బేగం, సుమన్, రాజ్ గగన్, వహీద్, ప్రవీణ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.