మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు,బొగ్గుగని కార్మికుడు బోగే మల్లయ్య కార్మికుడుగా పదవి విరమణ పొందడంతో ఆదివారం తోటి కార్మికులు పూలమాల,శాలువా ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు నిత్యం సింగరేణి పరిరక్షణ కంపెనీ సేవలో పరితరించి అందరి మన్నలు పొంది మంచి కార్మికునిగా ప్రశంసలు పొంది పదవి విరమణపొంధరన్నారు. ఆయన,ఆయన కుటుంబ సభ్యులు స్వచ్ఛ జీవితం సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.అదేవిధంగా మల్లన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐ ఎన్ టి సి కార్మిక సంఘంలో ఆర్గనైజర్ సెక్రెటరీగా పనిచేసి కార్మికుల హక్కుల కోసం పరితపించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్మికుల పాల్గొన్నారు.