– రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు
నవతెలంగాణ మల్హర్ రావు..
తెలంగాణ రాష్ట్ర పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల, మంథని నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు మకర సంక్రాంతి, కనుమ సందర్భంగా ప్రజలు సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి, కనుమ పండుగ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, రైతులు పాడి పంటలతో తులతూగి, ఆయా రంగాల్లో శ్రేయస్సు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీకని ఈ పండుగ అందరిలో స్నేహభావం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని తెలిపారు.ప్రజలందరూ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడంతో పాటు, స్వీయ భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. పండుగ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆనందం నింపాలని, సుఖ సంతోషాలతో నిండిన జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు.