
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సంక్రాంతి పండుగ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఒక పట్టణంలో జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పాడి పంటలతో తులతూగి, ఆయా రంగాల్లో శ్రేయస్సు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీకని ఈ పండుగ అందరిలో స్నేహభావం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని తెలిపారు.ప్రజలందరూ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడంతో పాటు, స్వీయ భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆందరు హెల్మెట్,సీట్ బెల్ట్ వాడుతు ప్రయాణాలు చేయాలని సూచించారు. పండుగ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆనందం నింపాలని, సుఖ సంతోషాలతో నిండిన జీవితం గడపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకాంక్షించారు.