
– పాఠశాల బాలికలకు బాల కవి సమ్మేళనం
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహాత్మ జ్యోతిబాపూలే సహచరి, కవయిత్రి సంఘసంస్కరణ వాది, శ్రీమతి సావిత్రిబాయి ఫూలె 194వ జయంతి వేడుకలు శుక్రవారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సరిత ఆదేశాల మేరకు ఇన్చార్జి ప్రిన్సిపల్ కె ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయాలలో ప్రజా పాలన భవన్ కి మహాత్మ జ్యోతిబాపూలే పేరు పెట్టడం అలాగే జనవరి 3 ను సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించడం చాలా మంచి నిర్ణయమన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులు నాగమని, ఫర్హిన్ ,ఆర్ రజిత ,ఎస్ రజిత, కనక లక్ష్మీ, వనజ, రాధ, సంధ్య, స్వప్న ,రజని ,జ్యోతి, అనిత, నిర్మల, మొత్తం 13 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. అలాగే పాఠశాలలోని బాలికలకు సావిత్రిబాయి జీవితం- చరిత్ర అనే శీర్షికతో బాల కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మహిళా ఉపాధ్యాయుల చేతులమీదుగా బహుమతుల అందించారు. అలాగే విద్యార్థినీ విద్యార్థులు ఆదర్శమూర్తి, మాతృ మూర్తి సావిత్రిబాయి పాటలకు నృత్యాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలోపాఠశాల సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ మహేందర్,ఉపాధ్యాయులు రాజు, సతీష్ ,శివకుమార్ ,మహేందర్, మధుకర్ ,రమణారెడ్డి, సంపత్, కంప్యూటర్ ఆపరేటర్ సమ్మయ్య పిఈటి మోహన్లతోపాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.