
ఈరోజు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు మాత సావిత్రిబాయి పూలే 193వ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ మహానీయురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని మహాత్మ జ్యోతిరావు ఫూలే సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి ఆ రోజుల్లో సత్యశోధక పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలకు విద్యపై ఎంతో పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, కోశాధికారి దీపక్, లైబ్రరీ సెక్రెటరీ పిల్లి శ్రీకాంత్, డాక్టర్ పులి జైపాల్, సి.హెచ్. రాజు, శీలం భాస్కర్, శేఖర్, సామ్రాట్ ఇందుమతి,అఖిల్, సురభి, అపూర్వ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.