ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి ..

Happy Savitribai Phule Jayanti..నవతెలంగాణ -తాడ్వాయి 
మండల కేంద్రంలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో (ఎంపీపీ ఎస్) ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం సోలం కృష్ణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పద్మజ ను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం కృష్ణయ్య మాట్లాడుతూ మహిళల విద్యను ప్రోత్సహించి అందుకోసం చారిత్రక పోరాటం నడిపిన ధీమశాలి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అందుకే మహిళా అభివృద్ధికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు పోరిక శంకర్, శాంసన్,రాజ్ కుమార్, రాజబాబు  విద్యార్థులూ తదితరులు పాల్గొన్నారు.