ఘనంగా సీనియర్ న్యాయవాది పుట్టినరోజు వేడుకలు

Happy senior advocate's birthdayనవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది వైద్య ఉమా శంకర్ 90వ జన్మదిన వేడుకలను న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. న్యాయమూర్తి జయశ్రీ కి సీనియర్ న్యాయవాది ఉమాశంకర్ బంధువు కావడంతో ఆమె ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మహిళా న్యాయవాదులు కేక్ కట్ చేయించారు అనంతరం న్యాయస్థానం ఆవరణలోని బార్ అసోసియేషన్ లో  న్యాయవాది ఉమాశంకర్ జన్మదిన వేడుకలను ఘనంగా న్యాయవాదులు జరిపారు. సీనియర్ న్యాయవాదిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేరు ఉన్న ఉమా శంకర్ 90వ వయసులో కూడా న్యాయవాద వృత్తిని ఇష్టంగా మలుచుకుని వకాలత్ చేస్తున్నాడని, ఆయన వద్ద ప్రతి ఒక్కరు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిందేనని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దోర్నాల సంజీవరెడ్డి తంగళ్ళపల్లి వెంకట్ లు అన్నారు. జన్మదిన వేడుకల్లో న్యాయవాదులు వసంతం గోవింద్ భాస్కర్ ఎల్లే సత్యనారాయణ కీసరి శ్రీనివాస్ అంకణి మురళి విష్ణు ప్రసాద్ తిరుపతి రవి పుష్పలత ఎల్లే జ్యోతి సుహాసిని మాజీ ఎంపీటీసీ వంకాయల భూమన్న తదితరులు పాల్గొన్నారు.