
సంత్ సేవా లాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను గురువారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసినందుకు గానూ నిర్వాహకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసారు. పట్టణంలోని గుర్రాల చెరువు రోడ్ గల ప్రశాంతి నగర్ లో మండల సేవా లాల్ జయంతి ఉత్సవ కమిటీ నిర్వాహకుడు హలావతు హరిబాబు గృహంలో ఉత్సవాలు నిర్వహించారు.మండలంలోని బంజారా సోదరీ సోదరులు భక్తిశ్రద్దలతో భోగ్ బంఢారో క్రతువుని విజయవంతంగా జరిపారు.ఇందులో ముందుగా గోధుమ రవ్వ తో చేయబడిన నైవేద్యాన్ని,హోమగుండంలో నెయ్యితో పాటుగా ప్రసాదాన్ని సేవా లాల్ మహారాజ్,మేర మా యాడికి అర్పించారు. దీనికిగాను ప్రత్యేకంగా హోమగుండం తయారుచేశారు.ఈ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి బంజారా జాతి మొత్తం కూడా సుఖశాంతులతో ఉండేలాగా సేవా లాల్ మహారాజ్ ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని ఈ సమాజం శ్రేయష్కరంగా ఉండాలని కోరుకున్నారు.సేవా లాల్ కు అర్పించిన ప్రత్యేక నైవేద్యాన్ని ఉపాధ్యాయులు రాందాస్ మరియు రమేష్ లు తయారు చేశారు. ఈ కార్యక్రమం లో సేల్స్ మెన్ కృష్ణ, అజ్మీరా వెంకటేశ్వరరావు, చిట్టిబాబు,సైదులు,హుస్సేన్, శోభన్,ఈరు శ్రీను,శంకర్ తదితరులు పాల్గొన్నారు.