
మండలంలోని కల్లెడ తండాలో సెవలాల్ జయంతిని ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాల అబివృద్దికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పేదల, బడుగు బలహీన వర్గాల అభివృద్దే తన ద్వేయంగా సూచించారు. మండల తండా వాసులతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మన్ డి. విఠల్ రావు, మాజీ జడ్పీటిసి లత పిర్ సింగ్, మండల తహశీల్దార్ షబ్బీర్, ఎంపీడీఓ క్రాంతి, స్థానిక మాజీ సర్పంచ్ పెదగాని పావని, నాయకులు, కార్యకర్తలు, బంజారా సభ్యులు పాల్గొన్నారు.