
దేశ భాషల్లో తెలుగు భాషకు మించిన భాషే లేదని అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అల్లందాసు బిక్షపతి అన్నారు. మంగళవారం పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి, ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష వ్యావహారిక భాషా అని, జాతి వికాసానికి, సంస్కృతికి, సమాజ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని ఉద్బోధించారు. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి కుమార్, రమేష్ కుమార్, శ్రీను, నరసింహారావు, రత్నం శ్రీనివాస్, సునిత రాణి, సునిత, గోవర్ధన్, సురేష్, రామతార, విద్యార్థులు పాల్గొన్నారు.