
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీలను, పీఎంపీలను గుర్తించి వారికి ఉచిత శిక్షణ ఇస్తామని ప్రకటించడం హర్షనీయమని ఆర్.ఎం.పి, పిఎంపి ల తిరుమలగిరి మండల అధ్యక్షుడు జలగం రామచంద్రన్ గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్థ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్ఎంపీలకు, పీఎంపీలకు ఉచిత శిక్షణ ఇవ్వడం తో పాటు సర్టిఫికెట్లను కూడా అందజేస్తామని ముఖ్యమంత్రివర్యులు తెలియజేయడం మాకు ఎంతో శుభ పరిణామం అని అన్నారు.మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించడంలో ఆర్ఎంపీలు పీఎంపీలు ఎనలేని సేవ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీలను, పీఎంపీలను ఆదుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఎన్నో సంవత్సరాలుగా ఆర్ఎంపీలు, పీఎంపీలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేలా కార్యచరణ రూపొందించాలని వేడుకున్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపీలను, పీఎంపీలను గుర్తించి అభివృద్ధికి సహకరించారని తిరిగి మళ్లీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఆర్ఎంపీలను గుర్తించిందన్నారు.
అనంతరం గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించిన వెంటనే స్పందించి ఇట్టి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆర్ఎంపీపీ ఎంపీల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్ ను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల వైద్యుల సంఘం అధ్యక్షుడు జలగం రామచంద్రన్ గౌడ్, కార్యదర్శి నాగరాజుగౌడ్, ట్రెజరర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రమేష్ నాయక్, జిల్లా కోశాధికారి జేరుపోతుల లక్ష్మణ్ గౌడ్, పప్పుల వెంకన్న, మద్దెల రవి, వేరుపుల వెంకన్న, పులుసు శేఖర్, మడుపు వెంకటేశ్వర్లు, జక్కుల నాగరాజు, భువనగిరి లక్ష్మణ్, భాషని లక్ష్మణ్, అంజి, యాదగిరి, గిరి గౌడ్, ఆలేటి శంకర్, జబ్బారు, చిలక శ్రీనివాస్, బాష్పాల మహేందర్, బొడ్డు సుందర్, శ్రీకాంత్, సోమేష్, బిస్పాస్, రెహమాన్, మంజుల, మమత, నిర్మల, సంగీత, హరిత, మాధవి, కనకధారా, ఐలయ్య, లక్ష్మయ్య, బిక్షం, శంబయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.