ఘనంగా మంచి నీళ్ళ దినోత్సవం..

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం మంచినీటి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆశ్వారావుపేట,పేరాయిగూడెం,కన్నాయిగూడెం పంచాయతీలో నిర్వహించే మంచినీళ్ల పండగ కార్యక్రమంలో ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్ నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన త్రాగు నీరు అందించాలనే ఉద్దేశంతో మహా సంకల్పంగా మిషన్ భగీరథ కు 2015 లో శ్రీకారం చుట్టింది అన్నారు.ఈ పథకాన్ని మొదలుపెట్టి 56 వేల కిలోమీటర్ల ప్రధాన పైపు లైన్లు మరియు వేల కిలోమీటర్ల అంతర్గత పైపు లైన్లు ఇతర ట్యాంకులను నిర్మించి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఈ పథకం ద్వారా మన జిల్లాలో (818) ట్యాంకులు(2,223)కిలోమీటర్ల పైపులు (2,06,643) నల్లా కలెక్షన్లు ద్వారా నీటి సరఫరా జరుగుతుంది అన్నారు.మన మండల వ్యాప్తంగా 118 ట్యాంకులు ద్వారా ఇంటింటికి నల్ల కలెక్షన్స్ 17,000, మండలంలో 160 కిలోమీటర్లు అంతర్గత పైప్ లైన్ ఏర్పాటు చేశారని,దిని ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి స్వఛ్చమైన త్రాగు నీరు అందించడం జరుగుతుంది అన్నారు. అనంతరం మిషన్ భగీరథ సిబ్బందికి అధికారులకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సర్పంచ్ లు అట్టం రమ్య,నార్లపాటి సుమతి,గొంది లక్ష్మణ్ రావు,ఈ.ఓ హరి క్రిష్ణ, కార్యదర్శి కోటమర్తి శ్రీరాం మూర్తి, ఎంపిటిసి లు,అధికారులు మండల నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.