గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డి ఎంపిక పట్ల హర్షం

నవతెలంగాణ- తుంగతుర్తి: త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి ఎన్నిక పట్ల మండల పరిధిలోని గానుగుబండ గ్రామానికి చెందిన గుండగాని సూర్య ప్రకాష్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తుంగతుర్తి మండల పరిధిలోని గానుగుబండ గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ మలక్ పేట మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా నియమించడం గానుగుబండ ప్రజలు ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ఎన్నికలవేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో శుభ పరిణామం అన్నారు.