ఘనంగా మహిళా దినోత్సవం..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నాగిరెడ్డిపేట్ మండల పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండలంలో పనిచేస్తున్న మహిళ పంచాయతీ కార్యదర్శులకు. ఫీల్డ్ అసిస్టెంట్లకు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు  మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులకు అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజదాస్. తాసిల్దార్ లక్ష్మణ్. ఎంపీడీవో పర్బన్న. ఎంపీ వో శ్రీనివాస్. మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.